ప్రయాణికులు వెళ్లిపోయినా.. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఇంకా సజీవంగా ఉన్న కరోనా వైరస్
- ఇటీవల యోకహామా రేవులో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ నౌక
- నౌకలోని 700 మందికి సోకిన కరోనా
- ఇటీవలే నౌక నుంచి ప్రయాణికుల తరలింపు
- నౌక క్యాబిన్లలో కరోనా ఉనికిని గుర్తించిన సీడీసీ పరిశోధకులు
ఎట్టకేలకు డైమండ్ ప్రిన్సెస్ లోని ప్రయాణికులందరినీ తరలించారు. తరలింపు కార్యక్రమం జరిగి రెండు వారాల పైనే అయింది. అయినప్పటికీ డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలోని క్యాబిన్లలో కరోనా వైరస్ ఉనికిని పరిశోధకులు కనుగొన్నారు. గత 17 రోజులుగా వైరస్ ఆ నౌకలో మనుగడ సాగిస్తుండడం ఆ మహమ్మారి మొండితనాన్ని సూచిస్తోందని పరిశోధకులు అంటున్నారు.