Corona Virus: హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారికి జియో ట్యాగ్ లు.. బయటకు వస్తే కఠిన చర్యలే!: రాచకొండ సీపీ

Geo tags fro home quarantined says  Rachakonda Police Commissioner
  • హోం క్వారంటైన్ లో ఉన్న వారు  బయటకు రావద్దు
  • నిబంధనలను ఉల్లంఘించేవారిని క్వారంటైన్లకు తరలిస్తాం
  • కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మహేశ్ భగవత్
హోం క్వారంలైన్ లో ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషర్ మహేశ్ భగవత్ తెలిపారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారిని జియో ట్యాగ్ చేశామని... ప్రత్యేక సిబ్బంది వారిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారు ఎట్టి  పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావద్దని  సూచించారు. వీరు నిబంధనలను  ఉల్లంఘించినా, బయటకు వచ్చినా... ఐసొలేషన్ కు, క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Corona Virus
Home Quarantine
Rachakonda Police
Mahesh Bhagavat

More Telugu News