singer kanika: సింగర్​ కనికకు రెండోసారి టెస్ట్.. కరోనా పాజిటివ్ ధ్రువీకరణ!

Kanika Kapoor tests positive for Covid19 a second time
  • మొదటి పరీక్ష ఫలితంపై కుటుంబ సభ్యుల అనుమానాలు
  • రెండోసారి టెస్ట్ చేసి నిర్ధారించిన వైద్యులు
  • ఆమె కుటుంబ సభ్యుల్లో 11 మందికి నెగిటివ్
బాలీవుడ్ సింగిర్ కనిక కపూర్ కరోనా బారిన పడినట్టు మరోసారి రుజువైంది. ఆమెకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కూడా వైరస్ నిర్ధారణ అయిందని లక్నోలోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ ప్రకటించింది. మొదటి పరీక్ష ఫలితంపై కనిక కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో వైద్యులు మరోసారి టెస్టులు చేశారు. కనికకు వైరస్ సోకిందని నిర్ధారించారు.

కనిక కుటుంబ సభ్యుల్లో చాలా మందికి వైరస్ సోకలేదని తెలిసింది. మొత్తం 35 మంది శాంపిల్స్ సేకరించగా, అందులో 11 మందికి  నెగిటివ్ అని తేలింది. మరో 24 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇక, ఆసుపత్రిలో తనకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్న కనిక ఆరోపణలను వైద్యులు కొట్టిపారేశారు.
singer kanika
again
tested
positive
Corona Virus

More Telugu News