icmr: భారత్‌లో కరోనాతో మరొకరి మృతి: ఐసీఎమ్‌ఆర్‌

coronavirus deaths in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) తెలిపింది. మహారాష్ట్రలో కరోనాతో పిలిప్పీన్స్‌ దేశానికి చెందిన ఓ మహిళ ఆదివారం రాత్రి కన్నుమూసిందని తెలిపింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది.

ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి సంఖ్య 89కు చేరింది. ఇక కరోనా బాధితులు కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణలో 27, ఉత్తరప్రదేశ్‌లో 27, కర్ణాటకలో 27, గుజరాత్‌లోలో 18 మంది ఉన్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 415గా ఉంది. 
Go Back to Shorts
icmr
Corona Virus
India

More Telugu News