చిరంజీవి సరసన ఖరారైన కాజల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి సరసన ఖరారైన కాజల్!

Kajal will join Acharya Movie
  • చిరూ సరసన చేయనున్న మాట నిజమే
  • త్వరలోనే షూటింగులో జాయిన్ అవుతాను 
  • గతంలో 'ఖైదీ నెంబర్ 150' చేసిన కాజల్
చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. వినోదమే ప్రధానంగా .. సామాజిక సందేశంతో కూడిన ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో చరణ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన 'త్రిష'ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది.

దాంతో ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేననే విషయాన్ని కాజల్ తాజాగా ధ్రువీకరించింది. చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో తాను చేయనున్నట్టుగా  చెప్పింది. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగు వాయిదా పడిందనీ, త్వరలోనే తాను షూటింగులో జాయిన్ కానున్నట్టుగా స్పష్టం చేసింది. గతంలో చిరూ జోడీగా ఆమె 'ఖైదీ నెంబర్ 150' చేసిన సంగతి తెలిసిందే.
Chiranjeevi
Kajal Agarwal
Koratala Siva Movie

More Telugu News