తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దుల బంద్... నిలిచిన వందలాది వాహనాలు!
- అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద భారీగా పోలీసులు
- కోదాడ వద్ద 5 కిలోమీటర్లు నిలిచిన వాహనాలు
- పోలీసులతో వాహనదారుల వాగ్వాదం
కాగా, పాలు, కూరగాయలు, మందులకు సంబంధించిన అత్యవసర వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని, అలాంటి వాటినే రాష్ట్రం నుంచి బయటకు వెళ్లనిస్తామని పోలీసు అధికారులు తేల్చి చెబుతున్నారు. చెక్ పోస్టుల వద్ద హెల్త్, పోలీస్, రవాణాశాఖ సిబ్బంది మూడు షిఫ్ట్ లలో పని చేస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నెలాఖరు వరకూ లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని సూచిస్తున్నారు.