బయటకొచ్చిన వారితో గుంజీలు తీయించిన పూణె పోలీసులు.. వీడియో వైరల్
- ఖాళీ రోడ్లను చూసి ఆగలేకపోయిన పూణె యువకులు
- బైకులతో రోడ్లపైకి..
- పువ్వులిచ్చి పంపిన హైదరాబాద్ పోలీసులు
పూణె పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. జనతా కర్ఫ్యూను పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిని పట్టుకుని గుంజీలు తీయించారు. మరోసారి బయటకు వస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించి పంపారు. యువకులతో గుంజీలు తీయిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోపక్క, హైదరాబాద్ పోలీసులు అయితే ఇలాంటి వారికి గులాబీ పూలు ఇచ్చి ఇంటికి పంపారు.