Corona Virus: ఏపీలో మూడు జిల్లాల్లో కరోనా వ్యాపించినట్టు కేంద్రం వెల్లడి

Three districts in AP effected by corona
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా వ్యాపించిన జిల్లాలను కేంద్రం తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో కరోనా ప్రభావం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీలో 3 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్టు తెలిపింది. విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కరోనా ప్రభావం ఉందని వివరించింది. అటు తెలంగాణలో 5 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్టు పేర్కొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కరోనా ప్రభావం ఉన్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీలోని 7 జిల్లాల్లోనూ కరోనా ప్రభావం ఉందని కేంద్రం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోని 10 జిల్లాల్లో కరోనా ప్రభావం ఉద్ధృతంగా ఉందని వివరించింది.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Prakasam District
Krishna District
Visakhapatnam District

More Telugu News