పదవీ విరమణ చేసిన సిబ్బంది మళ్లీ విధుల్లోకి : తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
- గడచిన ఐదేళ్లలో రిటైరైన వైద్యులు, నర్సులకు అవకాశం
- మూడు నెలలపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం
- కరోనాపై ముందు జాగ్రత్త చర్యల నేపథ్యంలో నిర్ణయం
వీరందరికీ కాంట్రాక్టు పద్ధతిలో మూడు నెలలపాటు పోస్టింగ్ ఇవ్వాలని ఆయా విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా మరింత విజృంభిస్తే బాధితులకు ఏ రకమైన సేవలందించాలన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రభుత్వం పరిస్థితి తీవ్రమైనప్పుడు వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఈనిర్ణయం తీసుకుంది.