చిరూ సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన కాజల్?
- షూటింగు దశలో 'ఆచార్య'
- కోటిన్నరకి ఓకే చెప్పిన కాజల్
- త్వరలోనే షూటింగుకి హాజరు
ఈ నేపథ్యంలోనే కథానాయికగా ఎన్నికైన 'త్రిష' ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో 'ఖైదీ నెంబర్ 150' సినిమాను దృష్టిలో పెట్టుకుని, కాజల్ అయితే బాగుంటుందని భావించి సంప్రదింపులు జరిపారట. అయితే పారితోషికంగా ఆమె రెండున్నర కోట్లు అడిగిందట. చివరికి ఒకటిన్నర కోటికి చేయడానికి ఆమె అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఆమె షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. మరోసారి తెరపై ఈ జంట ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి మరి.