Kanika Kapoor: బాలీవుడ్ సింగర్ కు కరోనా పాజిటివ్

Singer Kanika Kapoor Tests Positive For Coronavirus
  • 10 రోజుల క్రితం లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్
  • 4 రోజుల క్రితం బయటపడ్డ లక్షణాలు
  • కుటుంబసభ్యులతో పాటు క్వారంటైన్ లో గాయని
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. 10 రోజుల క్రితం ఈమె లండన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని వచ్చింది. లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసింది. దీనికి తోడు ఓ పార్టీలో కూడా పాల్గొంది.

తనకు కరోనా సోకినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఎయిర్ పోర్టులో తనకు అందరి మాదిరే పరీక్షలను నిర్వహించారని అప్పుడు ఏమీ లేదని చెప్పింది. వారం రోజుల తర్వాత కరోనా లక్షణాలు కనిపించడం ప్రారంభమైందని... 4 రోజుల క్రితం ఫ్లూ లక్షణాలు కనపడటంతో తనకు తాను పరీక్షలు చేయించుకున్నానని... పరీక్షల్లో కరోనా ఉన్నట్టు తేలిందని వెల్లడించింది. ప్రస్తుతం తాను, తన కుటుంబసభ్యులు క్వారంటైన్ లో ఉన్నామని తెలిపింది. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ నిర్బంధంలో ఉన్నారని చెప్పింది. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం విధించుకోవాలని... వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
Kanika Kapoor
Corona Virus
Positive
Bollywood
Singer

More Telugu News