Mahesh Babu: సుదీర్ఘ సమయం పట్టినా న్యాయం జరిగింది: మహేశ్ బాబు

Mahesh Babu comments on Nirbhaya convicts hang to death
  • తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరి అమలు
  • న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టారన్న మహేశ్ బాబు
  • తీవ్ర నేరాల్లో త్వరితగతిన తీర్పు రావాలని ఆకాంక్ష
నిర్భయ దోషులు నలుగురినీ ఈ ఉదయం తీహార్ జైల్లో ఉరితీయడంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. సుదీర్ఘ సమయం పాటు వేచిచూడాల్సి వచ్చినా చివరికి న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. ఈ ప్రక్రియ న్యాయవ్యవస్థ పట్ల నమ్మకాన్ని నిలబెట్టిందని పేర్కొన్నారు. "ఎక్కడా జంకకుండా ఇన్నేళ్లపాటు న్యాయపోరాటం సాగించిన నిర్భయ తల్లిదండ్రులకు, వారి న్యాయవాదులకు సెల్యూట్ చేస్తున్నాను. మన న్యాయవ్యవస్థను గౌరవిద్దాం. అయితే మరింత కఠిన చట్టాలు రావాలని, తీవ్ర నేరాల్లో సత్వరమే తీర్పులు రావాలని అభిలషిస్తున్నాను" అంటూ మహేశ్ బాబు ట్వీట్ వ్యాఖ్యానించారు.
Mahesh Babu
Nirbhaya
Convicts
Death
Hang
Tihar

More Telugu News