ఇటలీలో కరోనా తుపాన్.. ఒక్క రోజులో 475 మంది బలి!
- చైనాలో ఈ స్థాయిలో నమోదు కాని మరణాలు
- ఇటలీలో 2,978కి చేరుకున్న మృతుల సంఖ్య
- ప్రపంచవ్యాప్తంగా 8 వేల మందికిపైగా మృతి
ఇక, కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మరోవైపు, కరోనా వైరస్‌పై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ వెలుగు చూసిన వూహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. దేశంలో ఎవరికీ కొత్తగా కరోనా సోకలేదని వివరించింది. వూహాన్, హుబేయి ప్రాంతాల్లో ఆంక్షలను సడలించింది.