విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో కరణ్ జొహార్
- ఫ్లాప్ అయిన 'వరల్డ్ ఫేమస్ లవర్'
- ఇటీవలే చూసిన కరణ్ జొహార్
- కథ పట్ల ఆసక్తిని చూపుతున్న వైనం
ఇప్పుడు కరణ్ జొహార్ ఈ సినిమానే హిందీలోకి రీమేక్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. రీసెంట్ గా కరణ్ జొహార్ ఈ సినిమాను చూశాడట. ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వలన, హిందీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడట. అందువలన ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. మూడు ట్రాకుల్లో .. నలుగురు హీరోయిన్స్ తో సాగుతుంది గనుక, ఈ కథ నిజంగానే హిందీ ఆడియన్స్ కి నచ్చుతుందేమో చూడాలి.