ఆలస్యం కానున్న చిరంజీవి 'ఆచార్య'
- కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య'
- డిఫరెంట్ లుక్ తో చిరంజీవి
- విడుదల తేదీ మారే అవకాశం
కరోనా ఎఫెక్ట్ కారణంగా కొరటాల కూడా ఈ సినిమా షూటింగును వాయిదా వేశాడు. అనుకోకుండా ఏర్పడిన ఈ అంతరాయం వలన, షెడ్యూల్స్ ను మార్చుకోవలసి వస్తుంది. ఆర్టిస్టుల డేట్స్ ను బట్టి షెడ్యూల్స్ ను తిరిగి ప్లాన్ చేయడానికి ఎక్కువ సమయమే పడుతుంది. షూటింగు పరంగా జరుగుతున్న జాప్యం వలన, విడుదల విషయంలోను ఆలస్యం కానుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఆగస్టులో విడుదల కాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.