Vellampalli Srinivasa Rao: అమరజీవి పొట్టి శ్రీరాములుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు: మంత్రి వెల్లంపల్లి

  • పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమాలు
  • అమరజీవి ప్రాణ త్యాగాన్ని స్మరించుకోవాలి
  • పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన మంత్రి వెల్లంపల్లి
Minister Vellampalli tributes to Amarajivi potti sriramulu

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.  విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సామారంగ్ చౌక్ ఆర్యవైశ్య సంఘం, వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెల్లంపల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం, వెల్లంపల్లి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి గుర్తుగా మార్చి 16న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సీఎం జగన్ కి తన తరఫున, వైశ్య సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. పొట్టి శ్రీరాములుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం తర్వాత 1953 అక్టోబరు 1న ఒక రాష్ట్రంగా ఏర్పడిందని.. కానీ, భాషాప్రయుక్త రాష్ట్రంగా(ఆంధ్రప్రదేశ్) మాత్రం 1956 నవంబరు 1న అవతరించిందని తెలిపారు. అందుకే నవంబరు 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రతి ఏడాది జరుపుతామని జగన్ గతంలో మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్ణయించుకున్నామని గుర్తు చేశారు.

More Telugu News