Corona Virus: కరోనా వ్యాక్సిన్‌ను హస్తగతం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నించారా?

Has Trump conspired to hand over the Corona vaccine
  • వ్యాక్సిన్‌ కోసం జర్మనీ ఔషద సంస్థ ప్రయోగాల్లో పురోగతి
  • దాని హక్కులు కొనేందుకు ట్రంప్‌ భారీ మొత్తం ఆఫర్ చేశారని ఆరోపణలు
  • కలకలం సృష్టిస్తున్న జర్మన్ పత్రిక కథనం 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ను హస్తగతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారా? అంటే జర్మనీకి చెందిన ప్రముఖ పత్రిక ‘ది వైల్ట్’అవునని అంటోంది. ఈ మేరకు పత్రిక ప్రచురించిన కథనం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

వైల్ట్ కథనం ప్రకారం.. జర్మనీలోని ‘క్యూర్‌‌ వ్యాక్’ అనే ఔషద సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు పరిశోధన చేస్తోంది. అందులో కొంత పురోగతి కూడా సాధించింది. ఈ విషయం తెలుసుకున్న అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ప్రభుత్వం.. వ్యాక్సిన్‌ను సొంతం చేసుకోవాలని భావించింది. అందుకోసం భారీగా డబ్బు ఇస్తామని సదరు ఔషద సంస్థకు ఆఫర్ ఇచ్చింది. దాంతో, వ్యాక్సిన్‌ హక్కుల్ని కేవలం అమెరికాకే పరిమితం చేయాలని ట్రంప్‌ భావించినట్టు జర్మనీ మీడియా ఆరోపిస్తోంది.

ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో ‘క్యూర్ వ్యాక్స్‌’చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ మధ్య గత నెల సమావేశం కూడా జరగడం వీటికి బలం చేకూరుస్తోంది. కాగా, కరోనాను అరికట్టే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను జూలై నాటికి అందుబాటులోకి తెస్తామని సదరు సంస్థ గత వారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ను సొంతం చేసుకునేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలను జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి ధ్రువీకరించారు.

ఈ నేపథ్యంలో ‘క్యూర్ వ్యాక్‌’ సంస్థ తమ దేశం నుంచి తరలిపోకుండా జర్మనీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ పరిశోధనలకు పూర్తి స్థాయి ఆర్థిక సాయం చేస్తామని సదరు కంపెనీకి చెప్పినట్టు సమాచారం.

Corona Virus
vaccine
Donald Trump
conspired?

More Telugu News