Janasena: స్థానిక ఎన్నికల్లో జనసేన-బీజేపీ అభ్యర్థులపై వైసీపీ దాడుల వివరాలను తెలియజేయండి: పార్టీ నేతలకు జనసేన విజ్ఞప్తి

  • జనసేన-బీజేపీ అభ్యర్థులపై వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది
  • వైసీపీ దాడుల వివరాలను మాకు తెలియజేయండి 
  • ఆ వివరాలను ‘#ysrcppollviolence’ హ్యాష్ ట్యాగ్ తో తెలియజేయాలి
Janasena says Give details of the YCP attacks on our alliance candidates in local elections

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేసేందుకు వెళ్లిన ప్రత్యర్థులపై జరిగిన దాడులపై జనసేన, బీజేపీలు మండిపడుతున్న విషయం తెలిసిందే. తమ అభ్యర్థులు, నాయకులపై వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. ‘స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు, దాడుల వివరాలను ‘#ysrcppollviolence’ హ్యాష్ ట్యాగ్ తో తెలియజేయాలని కోరుతూ ఈ పోస్ట్ లో తమ పార్టీ నేతల్ని కోరారు.

More Telugu News