Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు

Madhya Pradesh MLAs to be conducted corona virus Tests
  • వివిధ ప్రాంతాల్లో క్యాంపులకు వెళ్లిన ఎమ్మెల్యేలు
  • కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం
  • కమల్‌నాథ్ బలపరీక్షపై సందిగ్ధం
మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇటీవల బెంగళూరులో పది రోజుల క్యాంపు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు హర్యానాలో, అధికార పక్ష ఎమ్మెల్యేలు జైపూర్‌లో క్యాంపు రాజకీయాలు చేశారు.

ఎమ్మెల్యేలు బసచేసిన ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తరుణ్‌ భానోత్‌ నిన్న రాత్రి తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు నిర్వహించాల్సిన బలపరీక్షపై సందిగ్ధత నెలకొంది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 107 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూసివేస్తున్నట్టు ప్రకటించాయి.
Madhya Pradesh
Kamal nath
MLAs
Corona tests

More Telugu News