సీఎం అయినంత మాత్రాన అన్నీ నీవు అనుకున్నట్టు జరగవు: కేశినేని నాని
- ఎన్నికలను వాయిదా వేయడంపై ఈసీని విమర్శించిన జగన్
- అన్నీ మీరు అనుకున్నట్టు జరగవని కేశినేని నాని వ్యాఖ్య
- ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుందని విమర్శ
'ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా' అని కేశినేని నాని అన్నారు. రాష్ట్రాన్ని నియంతలా పాలిద్దామంటే కుదరదని చెప్పారు. మీరు సీఎం అయినంత మాత్రాన... అన్నీ మీరు అనుకున్నట్టుగా జరగవని, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.