కరోనా కలకలంతో రెండు గంటలు ఆగిన ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’
- రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు రష్యన్లు
- వారు కరోనా బాధితులని తోటి ప్రయాణికుల అనుమానం
- వారిలో ఆ లక్షణాలు లేవని నిర్ధారణ
విషయం తెలిసిన రైలులోని వైద్య బృందం రష్యన్ల వద్దకు చేరుకుని పరీక్షలు నిర్వహించింది. వారిలో కరోనా లక్షణాలు లేవని నిర్ధారించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రైలు గమ్యానికి బయలుదేరింది. రష్యన్లను చూసి వారిని కరోనా బాధితులుగా ప్రయాణికులు భావించారని, అయితే వారిలో కరోనా లక్షణాలు లేవని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.