Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో పూజ 
  • ప్రభాస్ చిత్రానికి అమిత్ త్రివేది మ్యూజిక్ 
  • బాలకృష్ణ సినిమా పాటల చిత్రీకరణ  
Pooja Hegde in heroine oriented flick

 *  ఇటీవల 'అల వైకుంఠపురములో' చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయిక పూజ హెగ్డే త్వరలో తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హను రాఘవపూడి వినిపించిన కథ ఆమెకు నచ్చిందనీ, చేయడానికి ఆసక్తి చూపుతోందని అంటున్నారు.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓ డియర్' చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట్లో బాలీవుడ్ కంపోజర్ అమిత్ త్రివేదిని తీసుకున్నారు. అయితే, చిత్రం షూటింగ్ రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అవడంతో అమిత్ ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ, వీటిలో వాస్తవం లేదని అమిత్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడన్నది తాజా సమాచారం.    
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం రెండో షెడ్యూలు వచ్చే నెల రెండో వారం నుంచి జరుగుతుంది. ఇందులో పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ సరసన ఈ చిత్రంలో శ్రియ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More Telugu News