Spain: స్పెయిన్ లో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా

Corona spread rapidly in Spain
షార్ట్స్‌లో చూడండి
చైనా వెలుపల కరోనా వైరస్ అత్యధిక ప్రభావం చూపిస్తున్న దేశాల్లో స్పెయిన్ కూడా ఉంది. ఇప్పటివరకు అక్కడ 288 మంది మరణించారు. అయితే, స్పెయిన్ లో కరోనా వ్యాపిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే 2 వేల కొత్త కేసులు నమోదు కాగా, ఒక్కరోజులో 100 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం స్పెయిన్ లో కరోనా బాధితుల సంఖ్య 7 వేలకు పైనే ఉంది. ఒక్కరోజులో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడం పట్ల స్పెయిన్ అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఫుట్ బాల్ లీగ్ లకు ఎంతో పేరుగాంచిన స్పెయిన్ లో ఇప్పుడే ఏ స్టేడియం చూసిన ఖాళీగా బోసిపోయినట్టు కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Spain
Corona Virus
COVID-19
Deaths

More Telugu News