నేడు, రేపు మాత్రమే సర్వదర్శనం... ఆపై తిరుమలలో నూతన దర్శన విధానం!
- ఇక కేవలం టైమ్ స్లాట్ టోకెన్ దర్శనాలే
- ఎక్కడా ఆగకుండా స్వామి దర్శనానికి
- ఈ ఉదయం 4 కంపార్టుమెంట్లలో భక్తులు
వాస్తవానికి ఈ నిర్ణయాన్ని నేటి నుంచే అమలు చేయాలని భావించినా, వారాంతం కావడం, నిన్న మధ్యాహ్నానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వుండటంతో మంగళవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, ఈ ఉదయం 4 కంపార్టుమెంట్లలో స్వామి దర్శనం కోసం భక్తులు వేచివున్నారు.