జీఎస్టీ పోటు... పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు
- నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి సమావేశం
- మొబైల్ ఫోన్లపై 12 శాతం జీఎస్టీ 18 శాతానికి పెంపు
- ఏప్రిల్ 1 నుంచి అమలు
ఇది అమల్లోకి వస్తే ఏప్రిల్ నుంచి మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలొస్తాయి. ఏప్రిల్ 1 నుంచి సవరించిన జీఎస్టీ అమల్లోకి రానుండడమే అందుకు కారణం. ఇక, నిర్వహణ, మరమ్మతు, సమగ్ర సేవలపై ఇప్పటివరకు అమల్లో ఉన్న 18 శాతాన్ని ఒక్కసారిగా 5 శాతానికి తగ్గించారు. మరికొన్ని జీఎస్టీ సమీక్ష సమావేశాల అనంతరం ఈ ఏడాది జూలై నాటికి అందరికీ ఆమోదయోగ్యమైన జీఎస్టీ విధానం అందుబాటులోకి వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.