Planet: 640 కాంతి సంవత్సరాల దూరంలో అత్యంత వేడిగా ఉన్న గ్రహం గుర్తింపు

  • పగటిపూట 2400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు
  • ఇనుమును సైతం ఆవిరిగా మార్చే వేడి
  • హైరిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్ తో గుర్తించిన శాస్త్రవేత్తలు
ESO scientists recognize biggest planet beyond solar system

చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ఈఎస్ఓ) శాస్త్రవేత్తలు ఓ ఖగోళ అద్భుతాన్ని కనుగొన్నారు. సౌరవ్యవస్థకు ఆవల సుమారు 640 కాంతి సంవత్సరాల దూరంలో అతిపెద్ద గ్రహం ఉన్నట్టు గుర్తించారు. దీనికి డబ్ల్యూఏఎస్పీ-76బి అని నామకరణం చేశారు. ఈఎస్ఓ అబ్జర్వేటరీలోని హై రిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్ ను ఉపయోగించి ఈ అతిపెద్ద వేడి గ్రహం లక్షణాలను కనుగొన్నారు. ఈ గ్రహంపై స్విట్జర్లాండ్ లోని జెనీవా యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు.

ఈ గ్రహం ప్రత్యేకత ఏంటంటే అది అత్యంత వేడి గ్రహం. ఇక్కడ నమోదయ్యే పగటి ఉష్ణోగ్రతల గురించి వింటే హడలిపోతారు. మనం 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ అంటేనే అల్లాడిపోతుంటాం. కానీ ఈ గ్రహంలో 2400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయట. ఈ వేడికి బలమైన లోహాలు సైతం కరిగిపోవడమే కాదు, ఏకంగా ఆవిరిగా మారిపోతాయట. అయితే, రాత్రివేళల్లో గాలులు ఈ ఇనుప ఆవిరిని చల్లని ప్రదేశాలకు తీసుకెళతాయని, ఆవిరి రూపంలోని ఆ ఇనుము చల్లని ప్రదేశాల్లో గడ్డకట్టుకుపోతుందని ఈఎస్ఓ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.

More Telugu News