TJR Sudhaker Babu: పవన్​ కల్యాణ్​, బోండా ఉమాపై వైసీపీ నేత సుధాకర్​ బాబు ఆగ్రహం

YSRCP Mla Sudhaker Babu severe comments on pawankalyan and Bonda Uma
  • నామినేషన్ల ప్రక్రియపై పవన్ వ్యాఖ్యలు అర్థరహితం
  • బోండా ఉమా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో మాతో వస్తే చూపిస్తా
  • కులాల పేరిట చిచ్చుపెట్టాలన్నదే చంద్రబాబు కుట్ర
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంటే పవన్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మాచర్ల ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై ఇటీవల దాడి జరిగినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు? మాచర్లలో టీడీపీ నేతలు ఉన్నారుగా, అటువంటప్పుడు నిన్న బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. బోండా ఉమా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో తమతో వస్తే చూపిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులాల పేరిట చిచ్చుపెట్టాలన్నదే చంద్రబాబు కుట్ర అని ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన చరిత్ర బోండా ఉమాకు ఉందని విమర్శించారు.
TJR Sudhaker Babu
YSRCP
Pawan Kalyan
Janasena
Bonda Uma
Telugudesam
Chandrababu
Local Body Polls

More Telugu News