Corona Virus: కరోనా వైరస్‌పై సినిమా.. మూవీ పేరు ఖరారు

  • ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా
  • దాని కథ ఆధారంగా పాన్‌ ఇండియా మూవీ
  • ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్‌ రిజిస్టర్‌
  • సినిమా తీయనున్న కన్నడ దర్శకుడు ఉమేశ్
movie on corona virus

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా వైరస్‌పై సినీ పరిశ్రమ దృష్టి పడింది. ఈ వైరస్‌ ఆధారంగా ఓ  పాన్‌ ఇండియా సినిమా తీయాలని  క‌న్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం చక్కటి స్క్రిప్ట్‌ రూపొందించుకుంటున్నారు. ఈ సినిమాకు ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించారు.

ఈ సినిమా తీస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి వచ్చిందన్న అంశంతో పాటు అది ప్రపంచ దేశాలకు ఎలా వ్యాప్తి చెందింది? ఆ వైరస్‌ ప్రభావం జనాలపై ఎలా పడింది? అన్న అంశాలపై ఆయన కథ రూపొందించుకున్నారు.

More Telugu News