'ఆదిత్య 369' తరహాలో ప్రభాస్ మూవీ
- నాగ్ అశ్విన్ నుంచి భారీ చిత్రం
- రంగంలోకి దిగనున్న ప్రభాస్
- వివిధ భాషల్లో విడుదల
ఈ సినిమా .. 'ఆదిత్య 369' తరహాలో సాగుతుందనేది తాజా సమాచారం. ఆ సినిమా తరహాలోనే కాలంలో వెనక్కి వెళ్లడం .. భవిష్యత్తులోకి వెళ్లడం వంటివి ఈ సినిమాలో వుంటాయని అంటున్నారు. అయితే ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి 80న శాతం షూటింగ్ గ్రీన్ మ్యాట్ లోనే నాగ్ అశ్విన్ చిత్రీకరించనున్నాడని అంటున్నారు. ప్రభాస్ కి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.