విమానంలో హర్భజన్ సింగ్ బ్యాట్ మాయం!
- ముంబై నుంచి కోవైకి వెళ్లిన హర్భజన్
- ఇండిగో విమానంలో బ్యాటు మిస్సింగ్
- విచారణ జరిపించాలని డిమాండ్
కోవైలో దిగాక తన కిట్ బ్యాగ్ బరువు తక్కువగా అనిపించడంతో, చూడగా, బ్యాటు కనిపించలేదు. దీంతో వెంటనే ట్విట్టర్ ద్వారా ఇండిగో విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. తన బ్యాట్ పోయిందని, విచారించి, దాన్ని గుర్తించాలని సూచించారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఇండిగో ప్రతినిధి ఒకరు, బ్యాటును కనుగొనేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.