టాలీవుడ్ సీనియర్ నటుడు జనార్దన్ రావు కన్నుమూత

Tollywood senior actor Janardhan Rao died
  • అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూసిన జనార్దన్ రావు
  • 1000కి పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు
  • టీవీ సీరియళ్లతోనూ గుర్తింపు
  • చివరి చిత్రం జనతా గ్యారేజ్
తెలుగులో 1000కి పైగా చిత్రాల్లో నటించిన క్యారెక్టర్ నటుడు జనార్దన్ రావు మృతి చెందారు. గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామానికి చెందిన జనార్దన్ రావు సినీ, టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. కొండవీటి సింహం, అభిలాష, జానకిరాముడు, మజ్ను వంటి చిత్రాల్లో నటించారు. తలంబ్రాలు, గోకులంలో సీత వంటి సీరియళ్లతో ఆయన బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జనార్దన్ రావు చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన చివరగా నటించిన చిత్రం జనతా గ్యారేజ్. 40 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ లో జనార్దన్ రావు దిగ్గజాలు ఎన్టీఆర్ సహా అనేకమంది అగ్రహీరోల చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. జనార్దన్ రావు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Go Back to Shorts
Janardhan Rao
Tollywood
Actor
TV

More Telugu News