Rahul Gandhi: అమిత్ షా రాజీనామా చేయాల్సిందే: పార్లమెంటు వద్ద రాహుల్‌ సహా కాంగ్రెస్ ఎంపీల నిరసన

  • ఢిల్లీలో జరిగిన హింసపై ఆగ్రహం
  • పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తామంటున్న నేతలు
  • చర్చకు ఒప్పుకోకపోవడంపై ప్రతిపక్షాల మండిపాటు
Rahul Gandhi and other Congress MPs protest near Mahatma Gandhi statue at Parliament

ఢిల్లీలో జరిగిన హింసపై పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు ఈ రోజు ఉదయం నిరసన తెలిపారు. ఢిల్లీలో హింస నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.  

ఎన్డీయేతర పార్టీలన్నీ ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తున్నాయి. పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగకుండా బీజేపీ ప్రయత్నాలు జరుపుతోందని టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరిక్ ఒబ్రెయిన్‌ ఈ రోజు విమర్శలు గుప్పించారు. పార్లమెంటు రెండో దశ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 'ఢిల్లీ హింస'పై చర్చకు ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఈ రోజు పార్లమెంటులో తాను తప్పకుండా ఈ అంశంపై మాట్లాడి తీరుతానని చెప్పారు. 

More Telugu News