Telangana: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై

Budget session of the Telangana
  • తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుంది
  • ఆరు దశాబ్దాల పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది
  • తెలంగాణ చాలా రంగాల్లో అగ్రగామిగా నిలిచింది 
  • తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను  
తెలంగాణ శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలిసారి ప్రసంగించారు. 'ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుంది. ఆరు దశాబ్దాల పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది' అని తెలిపారు.

'స్వల్ప కాలంలోనే తెలంగాణ చాలా రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రంలో కరెంట్ కొరత అధికంగా ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజలకు ఆ బాధలు లేవు' అని తమిళిసై చెప్పారు.

'అప్పట్లో రైతుల ఆత్మహత్యలు, వలసలు ఉండేవి. విద్యుత్‌, నీళ్లు, ఎరువుల పరంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఇప్పుడు ప్రజలకు ఈ కష్టాలు ఎదురు కావట్లేదు. తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు కూడా నా ప్రభుత్వం పింఛను ఇస్తోంది. కేసీఆర్‌ కృషితో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది' అని గవర్నర్‌ ప్రసంగించారు. 
Telangana
Tamilisai Soundararajan
KCR

More Telugu News