Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • మిల్కీ బ్యూటీకి ఇష్టమైన డ్యాన్సర్ 
  • ఫ్యామిలీ డ్రామా చేస్తున్న రాజశేఖర్
  • రవిబాబు దర్శకత్వంలో 'క్రష్'
Thamanna gets inspired by Katrina

 *  మిల్కీ బ్యూటీ తమన్నా పాటల్లో డ్యాన్సులు అద్భుతంగా చేస్తుందన్న విషయం మనకు తెలుసు. అయితే, ఆమె దృష్టిలో మంచి డ్యాన్సర్ మాత్రం కత్రినా కైఫ్. 'అవును, ఎప్పటి నుంచో క్లోజ్ గా పరిశీలిస్తున్నాను. కత్రినా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అందుకే ఈ విషయంలో ఆమె నాకు ఇన్స్పిరేషన్' అంటూ చెప్పుకొచ్చింది.
*  ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ తాజాగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథాంశంతో సాగే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.  
*  దర్శకుడు, నటుడు రవిబాబు తాజాగా 'క్రష్' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్లు విడుదల అయ్యాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగా ఈ పోస్టర్లలోని జంట ముఖానికి మాస్క్ లు పెట్టుకుని ముద్దు పెట్టుకుంటోంది. ప్రస్తుతం షూటింగును జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేస్తారు.

More Telugu News