దుబాయ్ లో 16 ఏళ్ల ఇండియన్ స్టూడెంట్ కు కరోనా... తండ్రి నుంచే సోకింది!
- విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన విద్యార్థి తండ్రి
- కుటుంబం మొత్తానికీ చికిత్స
- వైరస్ వ్యాపించకుండా చర్యలు
ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. వారి ఆరోగ్యం ప్రస్తుతానికి మెరుగ్గానే ఉందని అన్నారు. ఈ వైరస్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలనూ తీసుకున్నామని, స్కూళ్లు, కంపెనీలపై ప్రత్యేక దృష్టి సారించామని దుబాయి హెల్త్ అథారిటీ పేర్కొంది. కాగా, నగర వ్యాప్తంగా ఇప్పటికే పలు స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.