'పలాస 1978' దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్
- 'పలాస 1978' ప్రివ్యూ షో చూసిన అల్లు అరవింద్
- దర్శకుడికి అభినందనలు
- 'గీతా ఆర్ట్స్ 2'లో అవకాశం
ప్రివ్యూ షో చూసిన అల్లు అరవింద్ .. దర్శకుడు కరుణ కుమార్ ను అభినందించారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఆయన ఈ సినిమాను ఎంతో సహజంగా చిత్రీకరించాడంటూ ప్రశంసించారు. కరుణ కుమార్ కి మంచి భవిష్యత్తు ఉందంటూ మెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఆయనతో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు అడ్వాన్స్ గా కరుణ కుమార్ కి తన చేతుల మీదుగా చెక్ ను అందించారు. దాంతో కరుణ కుమార్ తన రెండవ సినిమాను గీతా ఆర్ట్స్ 2లో చేయడమనేది ఖరారైపోయింది.