Anushka Shetty: 'సైజ్‌ జీరో' దర్శకుడితో అనుష్క పెళ్లంటూ వార్తలు!

Anushka Shetty to tie the knot with her Size Zero director Prakash Kovelamudi
  • ప్రకాశ్‌ కోవెలమూడితో అనుష్క ప్రేమలో ఉన్నట్టు ప్రచారం
  • దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌
  • బాలీవుడ్‌ స్క్రీన్‌ప్లే రైటర్‌‌ కనికా థిల్లన్‌తో విడాకులు తీసుకున్న ప్రకాశ్‌
అందం, అభినయంతోనే కాకుండా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌‌ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి రోజుకో వార్త వస్తోంది. ఆమె ప్రేమ,పెళ్లి గురించి తరచూ పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఆమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, యంగ్ డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి ప్రేమలో పడిందని, అతడినే ఆమె పెళ్లిచేసుకోబోతోందన్న వార్త హల్‌చల్ చేస్తోంది.  

2015లో విడుదలైన సైజ్‌ జీరో మూవీకి ప్రకాశ్‌ దర్శకత్వం వహించగా.. అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కుదిరి, తర్వాత అది ప్రేమగా మారిందట. దాంతో, త్వరలోనే ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రకాశ్‌కు ఇది వరకే పెళ్లైంది. ముంబైకి చెందిన స్క్రీన్‌ప్లే రైటర్‌‌ కనికా ధిల్లాన్‌ను 2014లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ, మూడేళ్ల తర్వాత ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం ఒంటరిగా ఉన్న 44 ఏళ్ల ప్రకాశ్.. 38 ఏళ్ల అనుష్క ఇద్దరూ ఒక్కటయ్యే అవకాశం ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటిదాకా పెదవి విప్పలేదు. కాగా, కొన్ని నెలల కిందట నార్త్ ఇండియాకు చెందిన ఓ క్రికెటర్‌‌తో అనుష్క పెళ్లి నిశ్చయం అయిందన్న వార్తలు వచ్చినా తర్వాత అవి నిజం కాదని తెలిసింది. అనుష్క ప్రస్తుతం 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది.
Anushka Shetty
marriage
Size Zero director
Prakash Kovelamudi

More Telugu News