Vijay Sai Reddy: ఆ విధంగా స్కెచ్ వేయడంలో బాబును మించిన వాళ్లు లేరు: విజయసాయిరెడ్డి

YSRCP MP Vijayasai Reddya says Chandrababu is a sketch master
  • ఏపీలో పెరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల వేడి
  • మద్యం, డబ్బు పంపిణీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ
  • ఆ వ్యాఖ్యలు చంద్రబాబే చెప్పించారన్న విజయసాయి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తాము ఎన్నికల్లోనే పోటీచేయబోమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నాడని, ఇది చంద్రబాబు చెప్పించిందేనని విజయసాయి ఆరోపించారు. కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి, ఏ మాట ఎవరితో అనిపించాలి అనే స్కెచ్ వేయడంలో చంద్రబాబును మించినవాళ్లెవరూ లేరని విజయసాయి వ్యాఖ్యానించారు.
Vijay Sai Reddy
Chandrababu
JC Diwakar Reddy
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News