KCR: గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్

Cm kcr meets Governor Tamilisai
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని సీఎం కేసీఆర్ కలిశారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్ భవన్ లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మండలి ఆమోదం పొందిన గవర్నర్ ప్రసంగం ప్రతిని ఆమెకు అందజేశారు.

కాగా, ఈ నెల 6 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ హాలులో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Go Back to Shorts
KCR
TRS
Governor
Tamilisai Soundararajan

More Telugu News