Raj Tarun: 'ఒరేయ్ బుజ్జిగా' నుంచి టీజర్ రిలీజ్

  • విజయ్ కుమార్ కొండా నుంచి లవ్ స్టోరీ
  • కీలకమైన పాత్రలో వాణీ విశ్వనాథ్ 
  • మార్చి 25వ తేదీన విడుదల
Orey Bujjiga Movie

కొంతకాలంగా రాజ్ తరుణ్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే 'ఒరేయ్ బుజ్జిగా'. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు.

ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. లవ్ ..  కామెడీ .. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. రాజ్ తరుణ్ సరసన నాయికలుగా మాళవిక నాయర్ .. హెబ్బా పటేల్ అలరించనుండగా, ఒక కీలకమైన పాత్రలో వాణీ విశ్వనాథ్ కనిపిస్తోంది. మాళవిక నాయర్ ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా అనిపిస్తోంది. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News