Prabhas: కరోనా ఎఫెక్ట్.. మాస్క్ ధరించిన ప్రభాస్.. వీడియో ఇదిగో!

Prabhas spotted wearing mask at airport
  • ఎయిర్ పోర్టులో మాస్క్ ధరించిన ప్రభాస్
  • వేగంగా నడుస్తూ ముందుకెళ్లిన వైనం
  • ప్రభాస్ చర్యతో ప్రజల్లో చైతన్యం వస్తుందంటున్న అభిమానులు
చైనాలో పుట్టిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇప్పటికే దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పలు దేశాల్లో ఈ మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలవరపరుస్తోంది. దీంతో, జనాలు ముందస్తు చర్యల్లో భాగంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు.

మరోవైపు, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కూడా మాస్క్ ధరించి కనిపించాడు. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న సమయంలో మాస్క్ ధరించాడు. చాలా వేగంగా నడుస్తూ కనిపించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులను ధరించడం వల్ల ఉపయోగం ఉంటుందనే సందేశాన్ని ప్రభాస్ తన అభిమానులకు ఇచ్చినట్టయింది. ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు మాస్కులు ధరించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని పలువురు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Prabhas
Tollywood
Corona Virus
Mask
Airport

More Telugu News