kala venkatrao: కుట్రలో భాగంగానే భద్రత తగ్గించి లోకేశ్‌పై దాడికి యత్నం: కళా వెంకట్రావ్

kala vankat rao says ycp leaders tried to attack lokesh
  • వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారు
  • ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
  • ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేకే దాడులు 
  • చర్యలు తీసుకోవాలి 
కుట్రలో భాగంగా టీడీపీ నేత నారా లోకేశ్‌కు భద్రత తగ్గించి వైసీపీ నేతలను ఆ పార్టీ అధిష్ఠానం దాడులకు ప్రోత్సహిస్తోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేశ్‌ పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారని కళా వెంకట్రావు చెప్పారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏపీలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేకే వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. దాడికి ప్రయత్నించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజా సంక్షేమం మరిచిన ఏపీ ప్రభుత్వం రౌడీయిజంతో పాలన సాగిస్తోందని కళా వెంకట్రావు చెప్పారు. అయినప్పటికీ తాము ప్రజల కోసం చేస్తోన్న పోరాటంలో వెనక్కి తగ్గబోమన్నారు. వైసీపీ సర్కారు వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు.  
kala venkatrao
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News