కరోనా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి హితవు పలికిన రాహుల్ గాంధీ
- భారత్ లో కరోనాపై ఆందోళన
- సోషల్ మీడియా అకౌంట్లతో విదూషకుడిలా వ్యవహరించొద్దంటూ రాహుల్ విసుర్లు
- ప్రజలను అప్రమత్తం చేయడంపై దృష్టి నిలపాలని సూచన
అంతేకాదు, కరోనా ప్రబలుతుండడంపై సింగపూర్ ప్రధాని తమ దేశ ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నాడో చూడండి అంటూ ఓ వీడియోను కూడా రాహుల్ పోస్టు చేశారు. ప్రతి దేశాధినేతకు పరిస్థితులు కొన్నిసార్లు పరీక్ష పెడతాయని, అయితే, నిజమైన నేత సమస్యను ఎదుర్కోవడంపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడతాడని రాహుల్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.