400 కత్తిపోట్లు.. 6 గంటల సేపు నరకం.. ఇంత దారుణాన్ని ఎప్పుడూ చూడలేదు: అంకిత్ శర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడి
- శరీరంలోని ప్రతి అవయవాన్ని ఛిద్రం చేశారు
- పేగులను కూడా బయటకు లాగారు
- ఆరుగురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొని ఉండొచ్చు
అంకిత్ శర్మను 400 సార్లు పొడిచారని పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఒక్క అవయవాన్ని కూడా వదలకుండా, ప్రతి భాగాన్ని ఛిద్రం చేశారు. పేగులు బయటకు లాగారు. సుమారు 4 నుంచి 6 గంటల సేపు ఈ దారుణకాండ కొనసాగి ఉంటుంది. కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ హత్యాకాండలో పాల్గొని ఉంటారు. ఆ తర్వాత మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారు. అంకిత్ శర్మ పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించిన వివరాలు ఇవి.