ఇరాన్ దేశ ఉపాధ్యక్షురాలికి సోకిన కరోనా వైరస్
- ఇరాన్ ను కబళిస్తున్న కరోనా వైరస్
- ఇప్పటి వరకు ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 26
- ఒక్క రోజులోనే ఈ మహమ్మారి బారిన పడ్డ 106 మంది
కరోనా బారిన పడి ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. కరోనా సోకిన వారి సంఖ్య 245కి చేరుకుందని... వీరిలో 106 మంది ఒక్క రోజులోనే ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. కరోనా భయాలతో ఇరాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.