అదృశ్యమైన ఇంజనీరింగ్‌ విద్యార్థి నిరంజన్‌రెడ్డి ఆచూకీ గోవాలో లభ్యం

  • హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాల విద్యార్థి
  • పదిహేను రోజుల క్రితం మాయం
  • స్థానికంగా కలకలం రేపిన ఘటన
నల్గొండకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి నిరంజన్‌రెడ్డి (20) గోవాలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో చదువుతున్న నిరంజన్‌ పదిహేను రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసింది. బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న నిరంజన్‌రెడ్డి పేట్‌బషీర్‌బాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి మైసమ్మగూడ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ హాస్టల్‌ కళాశాలకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం నిరంజన్‌ తండ్రి ప్రబోధర్‌రెడ్డికి హాస్టల్‌ నిర్వాహకులు ఫోన్‌ చేసి కొడుకు ఆచూకీ కనిపించడం లేదని తెలిపారు. దీంతో ఆందోళన చెందిన ప్రబోధర్‌రెడ్డి హుటాహుటిన నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలానికి కారణమైంది. పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకున్నారు.

తాజాగా నిరంజన్‌రెడ్డి గోవాలో ఉన్నట్లు కనుగొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అతను హాస్టల్‌ నుంచి ఎందుకు వెళ్లిపోయాడు? గోవా ఎందుకు వెళ్లాడు? అన్న విషయాలు ఇంకా తెలియరాలేదు.
Go Back to Shorts
Hyderabad
mallareddy engineering college
student missing
goa

More Telugu News