భారత్‌లో ముగిసిన ట్రంప్ రెండు రోజుల పర్యటన.. భారత్‌కు బైబై!
- రాత్రి 10:32 గంటలకు సతీసమేతంగా పయనం
- భారత్‌లో గడిపిన ఈ రెండు రోజులను మర్చిపోలేనన్న ట్రంప్
- ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాలపై రూ.21,500 కోట్ల ఒప్పందం
మొతేరా స్టేడియంలో తనకు లభించిన ఘన స్వాగతాన్ని స్మరించుకున్న ట్రంప్.. భారత్‌పైనా, ఇక్కడి ప్రజలపైనా అపారమైన గౌరవం ఉందన్నారు. భారత్‌లో గడిపిన ఈ రెండు రోజులను తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాలపై రూ.21,500 కోట్ల ఒప్పందం జరిగింది. చమురు, ఆరోగ్య రంగాల్లో మరో రెండు ఎంవోయూలు కుదిరాయి.