Donald Trump: కుటుంబ సమేతంగా భారత్‌లో అడుగుపెట్టిన ట్రంప్

trump visits india
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టారు. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలుకుతున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 'నమస్తే ట్రంప్‌' వేదికకు వారు చేరుకోనున్నారు. భారత్‌కు ట్రంప్‌ రావడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రంప్ తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ చూస్తారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగత వేడుకలను నిర్వహిస్తున్నారు.

Go Back to Shorts
Donald Trump
Narendra Modi

More Telugu News