Nandigam Suresh: అమరావతి రైతులపైకి దూసుకెళ్లిన ఎంపీ సురేశ్ కాన్వాయ్ లోని కారు!

  • అమరావతిలో అమరేశ్వరస్వామి రథోత్సవం
  • తరలివెళ్లిన రాజధాని రైతులు
  • రోడ్డుపక్కన నిల్చున్న రైతులను తాకుతూ వెళ్లిన కారు
రాజధాని రైతులకు ఊహించని పరిణామం ఎదురైంది. మొక్కులు చెల్లించుకునేందుకు అమరావతి ఆలయానికి వెళ్లిన రాజధాని రైతులపైకి వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ కాన్వాయ్ లోని వాహనం దూసుకొచ్చింది. వాహనాలు ఊరిబయటే పార్క్ చేసి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో రైతులు కాలినడకన ఆలయానికి బయల్దేరారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన వెళుతున్న రైతులను వాహనం వేగంగా తాకుతూ వెళ్లింది.

ఈ ఘటనలో తుళ్లూరు గ్రామానికి చెందిన తాడికొండ హనుమంతరావు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా, అమరావతి అమరేశ్వరస్వామి రథోత్సవం ప్రారంభానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, శంకర్రావు తదితరులు హాజరయ్యారు.
Nandigam Suresh
Amaravati
Farmers
Car

More Telugu News