Devisri Prasad: ఆయన ఎన్నిసార్లు కనపడితే అన్నిసార్లు కాళ్లమీద పడతా: దేవిశ్రీప్రసాద్

Tollywood music composer Devisri Prasad praises veteran director K Viswanath
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల వెల్లడి
  • 'సాగరసంగమం' తన ఫేవరెట్ పిక్చర్ అన్న దేవిశ్రీ
  • దాన్ని మించిన సినిమా మరొకటి రాదని వ్యాఖ్యలు
టాలీవుడ్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తనకు సాగరసంగమం వంటి నృత్య ప్రధాన చిత్రం చేయాలని ఉంటుందని తెలిపారు. అప్పటికీ, ఇప్పటికీ తాను మెచ్చే చిత్రం 'సాగరసంగమం' అని పేర్కొన్నారు. ప్రపంచంలో డ్యాన్స్ నేపథ్యంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో 'సాగరసంగమం' కూడా ఉంటుందని చెప్పారు. ఆ సినిమాను మించిన సినిమా మరొకటి రాదని, అంతటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కె.విశ్వనాథ్ ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు కాళ్లపై పడతానని అన్నారు.
Devisri Prasad
Sagara Sangamam
K.Viswanath
Tollywood

More Telugu News